తెలంగాణలోనూ వలంటీర్‌ వ్యవస్థ.. - అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం
Telugu Global
by Telugu Global
18m ago
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన అద్భుత వ్యవస్థలు వలంటీర్ల, సచివాలయ వ్యవస్థలు. ఇవి ఎంత సూపర్‌హిట్‌ అయ్యాయో తెలిసిందే. పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ వ్యవస్థలను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని నిర్ణయించాయి. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీలో సూపర్‌ హిట్‌ అయిన వలంటీర్‌ వ్యవస్థను తెలంగాణలో కూడా అమలు చేయాలని నిర్ణయించింది. వచ్చే జూలై నుంచి దీనిని అమలులోకి తీసుకురానున్నట్టు తాజాగా నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. సీఎం రేవంత్‌ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించిందని ఆయన తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో వలంటరీ వ్యవస్థను తీసుకొస్తామని ఈ ..read more
Visit website
బ్యాంకుల ముందు వృద్ధుల పడిగాపులు.. ఈ పాపం చంద్రబాబుదే
Telugu Global
by Telugu Global
18m ago
ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ మళ్లీ రచ్చగా మారింది. చంద్రబాబు కారణంగా వాలంటీర్ వ్యవస్థను పెన్షన్ల పంపిణీకి దూరం పెట్టింది ఈసీ. దీంతో ఈ వ్యవహారంలో తేడా వచ్చేసింది. వృద్ధులు, వికలాంగులు గత నెల సచివాలయాలకు వచ్చి పెన్షన్లు తీసుకున్నారు. కొంతమంది వృద్ధులు ఎండ దెబ్బకు విలవిల్లాడారు. మరికొందరు సచివాలయాల వరకు రాలేక అవస్థలు పడ్డారు. చంద్రబాబుపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో మరోసారి ఆయన డ్రామా మొదలు పెట్టారు. సచివాలయాల వద్ద పెన్షన్లు వద్దని, ఇంటింటికీ పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నేతలతో ఈసీకి ఫిర్యాదు చేయించారు. దీంతో అధికారులు పెన్షన్ల విషయంలో కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఈన ..read more
Visit website
అమిత్ షా ఫేక్‌ వీడియో కేసు.. ముగ్గురు టీ.కాంగ్రెస్‌ నేతల అరెస్టు
Telugu Global
by Telugu Global
18m ago
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. ఇవాళ మరో ముగ్గురిని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ సోషల్‌మీడియా ఇన్‌ఛార్జి మన్నె సతీష్‌తో పాటు నవీన్, తస్లీమాను పోలీసులు అరెస్టు చేశారు. అయితే తాజా అరెస్టులు తెలంగాణ బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జరిగనట్లు తెలుస్తోంది. ఢిల్లీ పోలీసుల నోటీసుల కన్నా ముందే ప్రేమేందర్ రెడ్డి ఈ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేసిన కేసులో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఇటీవల ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చి ..read more
Visit website
జగన్‌ కోసం సిద్ధం.. వైసీపీ కొత్త స్లోగన్‌
Telugu Global
by Telugu Global
35m ago
పోలింగ్‌కు మరో 10 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసింది వైసీపీ. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం లాంటి స్లోగన్స్‌తో జనాల్లోకి వెళ్లిన వైసీపీ.. మరో నూత‌న కార్యక్రమానికి శ్రీకారానికి చుట్టింది. ఇవాల్టి నుంచి జగన్‌ కోసం సిద్ధం పేరుతో ప్రచారం నిర్వహించనున్నారు పార్టీ నేతలు. ఇందులో భాగంగా వైసీపీ మేనిఫెస్టోని ఇంటింటికి తీసుకెళ్లనున్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ క్యాంపెయినర్లు పాల్గొననున్నారు. ఇటీవల 37 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన వైసీపీ.. అందులో 12 ..read more
Visit website
హైదరాబాద్ లో నేడు సన్ రైజర్స్ కు రాయల్స్ చాలెంజ్!
Telugu Global
by Telugu Global
35m ago
దేశంలోని పదినగరాల చుట్టూ తిరుగుతున్న ఐపీఎల్-2024 సర్కస్ మరోసారి హైదరాబాద్ కు చేరింది. ఈ రోజు జరిగే కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ కు సన్ రైజర్స్ సవాలు విసురుతోంది. దేశంలోని వేసవి తీవ్రతస్థాయిలోనే ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ మ్యాచ్ లు సైతం హాట్ హాట్ గా సాగిపోతున్నాయి. దేశంలోని 10 నగరాలు 11 వేదికల్లో గత నాలుగువారాలుగా జరుగుతున్న తొలిఅంచె డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ లోని 50వ మ్యాచ్ కు హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. లీగ్ టేబుల్ టాపర్ రాజస్థాన్ రాయల్స్, 5వ స్థానంలో నిలిచిన సన్ రైజర్స్ జట్ల పోరు ఈ రోజురాత్రి 7-30 ..read more
Visit website
పవన్ మరీ అంతలా భయపడ్డారా..? పిఠాపురంలో మరో హీరో
Telugu Global
by Telugu Global
3h ago
పార్టీ అధినేత అంటే ఎలా ఉండాలి..? తన నియోజకవర్గంలో ప్రచారం చేసినా, చేయకపోయినా.. పార్టీ తరపున నిలబెట్టిన అభ్యర్థుల నియోజకవర్గాల్లో మాత్రం కచ్చితంగా ప్రచారం చేయాలి, వారి గెలుపుకోసం కష్టపడాలి. కానీ పవన్ కల్యాణ్ లో మాత్రం అలాంటి నాయకత్వ లక్షణాలు లేవు. తనతో కలిపి 21 అసెంబ్లీ, 2 ..read more
Visit website
‘పోలవరం’పై పవన్‌ వ్యాఖ్యలకు సీపీఎం ఆగ్రహం
Telugu Global
by Telugu Global
3h ago
పోలవరం ప్రాజెక్టుపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ప్రచారం నిర్వహించిన పవన్‌ కళ్యాణ్‌ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాసం, పరిహారం నిమిత్తం రాష్ట్ర ప్రజలపై సెస్సు విధిస్తామని ప్రకటించారు. పవన్‌ వ్యాఖ్యలపై సీపీఎం ఘాటుగా స్పందించింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రాష్ట్ర ప్రజల నెత్తిన పోలవరం పన్ను వేసేలా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని మండిపడ్డారు. పవన్‌ వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. విభజన చట్టం ప్రకారం జాతీయ ..read more
Visit website
ప్రచారానికే దూరం.. ప్రజల హృదయాలకు కాదు
Telugu Global
by Telugu Global
4h ago
తెలంగాణకు బీజేపీ గాడిద గుడ్డు ఇచ్చిందని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి, 4 నెలల్లో ప్రజలకు ఇచ్చింది కూడా గాడిద గుడ్డేనని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. 100 రోజుల్లో హామీల అమలు అని మోసం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పై కోపంతో బీజేపీకి ఓటు వేయొద్దని, అదే జరిగితే పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇంకా ఆగం అవుతామని పేర్కొన్నారు. ఎప్పటికైనా బీఆర్‌ఎస్సే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు హరీష్ రావు. LIVE : మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish రోడ్ షో, నంగనూర్, సిద్దిపేట నియోజకవర్గం #VoteForCar https://t.co/N9yHS62iuv — BRS Party ..read more
Visit website
కేసులు, ఆస్తుల వివరాలు పత్రికల్లో ప్రచురించాల్సిందే.. - తేల్చిచెప్పిన హైకోర్టు
Telugu Global
by Telugu Global
4h ago
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా పత్రికల్లో ప్రచురించాల్సిందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అంతేకాదు.. ఆయా పార్టీల వెబ్‌సైట్‌లలో కూడా ఆ వివరాలను పొందుపరచాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, జస్టిస్‌ రావు రఘునందన్‌రావులతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల కేసుల వివరాలు, ఆస్తుల వివరాలకు సంబంధించిన ఫారం 26 ..read more
Visit website
చంద్రబాబు, జగన్.. ఉద్యోగులకు మేలు చేసిందెవరు..?
Telugu Global
by Telugu Global
5h ago
ఏపీలో సంక్షేమ పథకాల లబ్ధిదారులెవరూ చంద్రబాబుకి ఓటు వేసే పరిస్థితి లేదు. చేతి వృత్తులవారు, ఎస్సీ, ఎస్టీలు కూడా కూటమివైపు చూడటం లేదు. ఇక ముస్లింల ఓటు ఒక్కటి కూడా కూటమికి పడే అవకాశం లేదు. ఈ దశలో యువతకు, ఉద్యోగులకు మాయమాటలు చెప్పి తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది టీడీపీ. ఉద్యోగులు, పెన్షనర్లను వైసీపీకి దూరం చేసేందుకు ఎల్లో మీడియా తప్పుడు కథనాలిస్తోంది. అసలు ఈ కథనాల్లో వాస్తవం ఎంత..? ఉద్యోగులకు మేలు చేసిన ముఖ్యమంత్రి ఎవరు..? చంద్రబాబు..? జగనా..? చంద్రబాబు హయాంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగింది. జన్మభూమి కమిటీ మీటింగుల్లో చోటా మోటా నేతలు కూడా ఉద్యోగులపై తిట్లదండకం అందుకునేవారు, వారిని నీఛంగా చూసేవార ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR