Mana Telangana
101 FOLLOWERS
Log on to Mana Telangana for Latest Telugu News Updates. Movie News, Telangana and Andhra Pradesh Politics and latest Telugu Breaking News. We are Telangana's Leading Telugu Daily News Paper Which Covers Telangana News, Entertainment, Sports News.
Mana Telangana
4m ago
రెండంతస్తుల భవనం కుప్పకూలడంతో కొంతమంది శిథిలాల చిక్కకున్నారు. దీంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటన ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మందిని రక్షించిన అధికారులు వారిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. మరికొంతమంది వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. బయటకు తీసుకొచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనపై డిసిపి సెంట్రల్ ఎం హర్షవర్ధన్ మాట్లాడుతూ..”ఉదయం […] ..read more
Mana Telangana
4m ago
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కథానాయకులుగా తెరకెక్కిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం గతేడాది అక్టోబరులో విడుదలైన భారీ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు దీని సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు మ్యాడ్ స్క్యేర్ టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అలాగే, ఫస్ట్ సింగిల్ […] ..read more
Mana Telangana
1h ago
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్ నెల కోటా ఆన్‌లైన్ టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం సెప్టెంబర్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు సెప్టెంబర్ 20 నుండి 22 వరకు మధ్యాహ్నం 12 ..read more
Mana Telangana
1h ago
పాట్నా: కదులుతున్న కారులో బాలికను గన్‌తో బెదిరించి ఆమెపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ సంఘటన బిహార్‌లోని సహర్షా జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సెప్టెంబర్ 14 ..read more
Mana Telangana
1h ago
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరుగుతోంది. ఏడు జిల్లాలోని 24 నియోజకవర్గాలలో 11 గంటల వరకు 26.72 శాతం పోలింగ్ నమోదైంది. తొలి విడతలో 23 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగింకోనున్నారు. ఓటర్లలో 5.66 ..read more
Mana Telangana
3h ago
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరిలో జిల్లాలోని నాచారంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హెచ్ఎంటి కమాన్ సమీపంలో స్కూటీని గ్యాస్ సిలిండర్ లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… టిఎస్ 08 ..read more
Mana Telangana
3h ago
ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటుతున్న స్థానికులు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్బంగా 74 మొక్కలు నాటే కార్యక్రమం దిస్ పూర్: హరిత భారత్ సాధన లక్ష్యంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అస్సాంలో మొదలు పెట్టిన కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. 2030 ..read more
Mana Telangana
3h ago
మూడో దఫా అధికారంలోకి వచ్చి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఈ దఫా ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం అమలుకు కంకణం కట్టుకున్నట్లుగానే కనిపిస్తోంది. పదేళ్ల క్రితం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవకాశం వచ్చినప్పుడల్లా జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తూనే ఉంది. అయితే గత రెండు దఫాలుగా సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కమలనాథులు ఈసారి సంకీర్ణ భాగస్వాముల మద్దతుపై ఆధారపడి […] ..read more
Mana Telangana
3h ago
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మెట్రో స్టేషన్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కర్నాటకలో జరిగింది. బెంగళూరులోని జ్ఞానభారతి మెట్రో స్టేషన్‌లో సిద్దార్థ్ అనే యువకుడు(30 ..read more