రైతులపై ప్రేమ ఉంటే రాజీనామా లేఖను స్పీకర్ కి ఇవ్వండి..
Telugu Global
by Telugu Global
10h ago
తెలంగాణలో రాజీనామా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. హరీష్ రావు రాజీనామా లేఖతో నేరుగా గన్ పార్క్ వద్దకు వచ్చి కాంగ్రెస్ కి సవాల్ విసిరారు. అయితే ఆ రాజీనామా లేఖపై ఇప్పుడు కాంగ్రెస్ రాజకీయం మొదలు పెట్టింది. అది రాజీనామా లెటర్ కాదని, అందులో మేటర్ సీసపద్యం అంత ఉందని సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంత్రి కోమటి రెడ్డి కూడా ఆ లేఖపై వ్యంగ్యంగా స్పందించారు. రాజీనామా లేఖ అంటే కేవలం ఒకటిన్నర లైన్ ఉండాలని, హరీష్ రావు ఒకటిన్నర పేజీ రాశారని అదెలా చెల్లుబాటు అవుతుందన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రాజీనామా పేరుతో హరీష్ రావు నాటకాలాడుతున్నారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి. దొంగ రాజీనామా లేఖలను ఎందుకు ఇస్తు ..read more
Visit website
షర్మిల తప్పుడు ఆరోపణలను ఖండించిన పొన్నవోలు
Telugu Global
by Telugu Global
11h ago
ఎన్నికలకు సమయం దగ్గరపడేకొద్దీ షర్మిల తన వికృత రాజకీయ నిజ స్వరూపాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారు. అయితే ఆమె చేస్తున్న ఆరోపణల్లో పస లేదని, చంద్రబాబులాగా పదే పదే ఒకే అబద్ధాన్ని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనే విషయం అందరికీ అర్థమవుతోంది. తాజాగా షర్మిల ఇలాంటి ఆరోపణలే చేశారని, అసత్యాలతో జగన్ పై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. షర్మిల తన రాజకీయ లబ్ధికోసం ఇటీవల సీఎం జగన్ ని టార్గెట్ చేశారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్యయంగా తన అన్న వైఎస్ జగనే అని షర్మిల ఓ సభలో నిందలు వేశారు. తన లాయర్ పొన్నవోలు స ..read more
Visit website
అందుకే కన్నీళ్లు -బొత్స
Telugu Global
by Telugu Global
11h ago
ఇటీవల మేమంతా సిద్ధం సభలో మంత్రి బొత్స తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ తనను పరిచయం చేసే క్రమంలో తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు మంత్రి బొత్స. జగన్‌ తనను తండ్రితో పోల్చినప్పుడు దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి గుర్తొచ్చారని, జగన్‌ తన పేరు పిలవగానే జనం కూడా బాగా స్పందించారని, అందుకే భావోద్వేగానికి గురయ్యానని వివరించారు. ఏపీ విద్యాశాఖలో అవినీతి జరగలేదని, ఈ విషయంలో కొన్ని పత్రికలు దురుద్దేశంతో కథనాలు రాసి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నాయని మండిపడ్డారు మంత్రి బొత్స. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడైనా ..read more
Visit website
ఓటుకు 5 నుంచి 10వేలు.. కడియం ఖర్చు 100 కోట్లా..?
Telugu Global
by Telugu Global
12h ago
ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆరోపించారు. అవినీతితో వందల కోట్లు సంపాదించిన కడియం.. ఆ సొమ్ముతో తన కూతురు కడియం కావ్యను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు. ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వబోతున్నాడని.. కూతురి కోసం రూ.100 ..read more
Visit website
హంటర్ ఐలాండ్స్ గురించి తెలుసా? ఇదొక అంతుచిక్కని మిస్టరీ!
Telugu Global
by Telugu Global
12h ago
స్కాట్లాండ్‌లో సముద్రం మధ్యలో ఉండే ఏడు ఐలాండ్స్‌కి వెళ్లాలంటే భయంతో వణికిపోతారు అక్కడివాళ్లు. అక్కడికి వెళ్లినవాళ్లంతా మాయమైపోవడమే దానికి గల కారణం. అందుకే వాటికి ‘సెవన్ హంటర్స్ ఐలాండ్స్’ అని పేరు పెట్టారు. అసలక్కడ ఏం జరుగుతుందంటే.. స్కాట్లాండ్‌ సముద్రతీరానికి సుమారు 380 కిలోమీటర్ల దూరంలో ‘ఫ్లానన్ ఐల్స్’ అనే ఏడు ఐలాండ్స్ ఉండేవి. ఆ ఐలాండ్స్ అంటే అక్కడి వాళ్లకు భయం. అయితే సెవన్ హంటర్స్ ఐలాండ్స్‌లోని ఇలియన్‌మోర్ అనే ద్వీపంలో 300 మీటర్లు ఎత్తు ఉండే లైట్ హౌస్ టవర్ కట్టాలని 1896 ..read more
Visit website
నా కుటుంబంపై దాడులు జరిగితే పవన్‌ ఏనాడూ స్పందించలేదు
Telugu Global
by Telugu Global
12h ago
కాపు ఉద్యమాన్ని అణచివేసిన వ్యక్తితో నేడు పవన్‌ కల్యాణ్‌ చేతులు కలిపాడని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో శుక్రవారం నిర్వహించిన కాపు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పవన్‌ తీరుపై విమర్శలు గుప్పించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి డబ్బు సంపాదన కోసం వచ్చావా పవన్‌ అంటూ నిలదీశారు. చంద్రబాబు హయాంలో తన భార్యా పిల్లలపై దాడులు, అరెస్టులు జరిగితే పవన్‌ కల్యాణ్‌ ఏనాడూ స్పందించలేదని ఆయన తెలిపారు. అధికార దాహంతో బాబు కుట్రలు చేస్తున్నాడు.. చంద్రబాబు అధికార దాహంతో ఉన్నాడని, ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు చేస్తున్నాడని ముద్రగడ పద్ ..read more
Visit website
‘నోటా’కు ఎక్కువ ఓట్లొస్తే.. - సుప్రీం కోర్టులో పిటిషన్‌
Telugu Global
by Telugu Global
13h ago
సాధారణంగా ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే వారే గెలిచినట్టు నిర్ధారించి ప్రకటిస్తారు. మరి అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. అప్పుడు ఏం చేయాలి?. అంటే దానికి సంబంధించి ఎలాంటి నిబంధనలూ రూపొందించలేదు. ఈ నేపథ్యంలో ఈ అంశాలను ప్రస్తావిస్తూ శివ్‌ ఖేరా అనే రచయిత తన పిటిషన్‌ ద్వారా లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్‌ నిర్వహించాలని కోరుతూ శివ్‌ ఖేరా తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేయడం గమనార్హం. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని జ ..read more
Visit website
కేంద్ర ఐటీ నిబంధనలకు నో చెప్పిన వాట్సాప్‌.. – ఒత్తిడి చేస్తే భారత్‌ నుంచి వెళ్లిపోతామని వెల్లడి
Telugu Global
by Telugu Global
13h ago
కేంద్ర ఐటీ నిబంధనల్లో వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించే నిబంధనలను అమలు చేసేందుకు వాట్సాప్‌ నో చెప్పింది. ఢిల్లీ హైకోర్టులో దీనిపై జరుగుతున్న విచారణ సందర్భంగా ఈ విషయాన్ని వాట్సాప్‌ సంస్థ తరపు న్యాయవాది తేజస్‌ కరియా న్యాయస్థానానికి తెలియజేశారు. 2021 ..read more
Visit website
Chunduru Police Station Movie Review: చుండూరు పోలీస్ స్టేషన్ రివ్యూ! {3/5}
Telugu Global
by Telugu Global
13h ago
చిత్రం: చుండూరు పోలీస్ స్టేషన్ రచన - దర్శకత్వం : మార్టిన్ ప్రకట్ తారాగణం : కెంచకో బొబన్, జోజు జార్జి, నిమీషా సజయన్, యమ గిల్గమేష్, జాఫర్ ఇడుక్కి తదితరులు రచన : షాహీ కబీర్, సంగీతం : విష్ణు విజయ్, ఛాయాగ్రహణం : షైజు ఖాలిద్ బ్యానర్ : గోల్డెన్ కాయిన్ మోషన్ పిక్చర్, మార్టిన్ ప్రకట్ ఫిలిమ్స్ నిర్మాతలు : రంజిత్, పి ఎం శశిధరన్, మార్టిన్ ప్రకట్ విడుదల : ఏప్రిల్ 26, 2024 (ఆహా ఒటీటీ) రేటింగ్: 3/5 2021 లో మలయాళంలో సూపర్ హిట్టయిన పోలీస్ థ్రిల్లర్ ‘నాయాట్టు’ 2023 ..read more
Visit website
తాతకు దగ్గు నేర్పినట్టు.. గుండు, అరగుండు.. రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి
Telugu Global
by Telugu Global
15h ago
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు సెమీ ఫైనల్స్ మాత్రమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జరిగే లోక్‌సభ ఎన్నికలే ఫైనల్స్ అన్నారు. హైదరాబాద్‌లో పార్టీ సోషల్ మీడియా వారియర్లతో సమావేశమైన ఆయన.. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. "సెమీ ఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించాం. అంటే సెమీ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించాం. ఇప్పుడు ఫైనల్స్‌లో మనం పాకిస్థాన్‌తో కొట్లాడాలి. మోడీ, అమిత్‌షా, నడ్డా సహా చాలా మంది నాయకులు మనల్ని ఓడించాలని తెలంగాణ మీద ముప్పేట దాడి చేస్తున్నారు. సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషుల్ని వాడుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మతం, ప్రభుత్వ ఏజెన్సీలను ..read more
Visit website

Follow Telugu Global on FeedSpot

Continue with Google
Continue with Apple
OR